NTV Telugu Site icon

Botsa Satyanarayana: వచ్చే ఉగాది నాటికి టీడీపీ, జనసేన ఉండవు.. ఉంటే గుండు గీయించుకుంటా..

Bosta

Bosta

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో గడపగడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అమావాస్య( ఉగాది )నాటికి రెండు రాజకీయ పార్టీలు ఉండవని తెలిపారు. తెలుగుదేశం, జనసేన ఉండవని.. ఉంటే గుండు గీయించుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతసేపు రాజకీయాలే తప్ప.. చిత్తశుద్ది లేదని ఆరోపించారు. రాజకీయ అనుభవంతో చెబుతున్నానని.. ప్రజలకు మంచి చేయాలనే తపన వారికి లేదని మంత్రి బొత్స పేర్కొన్నారు.

Adani Ports: మేనేజ్‌మెంట్‌తో విభేదాలు.. అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి డెలాయిట్ రాజీనామా

తోటపల్లిని తానే శంకుస్థాపన చేశానని మంత్రి బొత్స చెప్పారు. ఎన్నికలకు మూడు రోజులు ముందు శంకుస్థాపన చేసినట్లు చెప్పడం.. సిగ్గులేదా అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికలు వచ్చిన్నప్పుడే స్కీములు గుర్తొస్తున్నాయి అని మంత్రి ఫైర్ అయ్యారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే మట్టి కొట్టుకుపోతారని ఆయన ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఎందుకు అని అంటుంటే ఆశ్చర్యం వేస్తుందని.. జగన్ పెట్టామన్నారా, విజయమ్మ పెట్టమన్నారా.. ప్రజలు అభిమానంతో వైఎస్ విగ్రహాలు పెట్టుకున్నారని మంత్రి బొత్స తెలిపారు.