Mega PTM 3.0: తమ పిల్లలు ఎలా చదువుతున్నారో నరుగా స్కూల్‌కు వెళ్లి తెలుసుకునే విధంగా.. మెగా PTM కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే రెండు పీటీఎంలు విజయవంతం కాగా.. ఈ రోజు మూడో పీటీఎం నిర్వహిస్తున్నారు.. శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో పేరెంట్, టీచర్ మీటింగ్‌లో పాల్గొన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్.. విద్యార్థులు.. తల్లి, తండ్రితో సీఎం ముఖాముఖి నిర్వహించారు.. పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.. మీకు తల్లికి వందనం వచ్చిందా అని అడిగారు… 9 మంది పిల్లలకు 90 వేలు వచ్చిందా అని అడిగగా.. వచ్చిందని సమాధానం ఇచ్చారు.. అయితే, రాబోయే రోజుల్లో పిల్లలు మీకు ఆస్తి అని తెలిపారు చంద్రబాబు..
ఇక, ప్రోగ్రెస్ కార్డును చూసిన సీఎం.. అబ్సెంట్ ను, సబ్జెక్టుల వారీగా మార్కులు చదివారు.. మూడు సబ్జెక్టులలో మార్కులు తగ్గాయి ఎందుకు అని ప్రశ్నించారు.. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయిగా అంటూ తల్లిదండ్రులను అడిగారు.. తండ్రిగా నీవు ప్రతీ సారి మీటింగ్ లకు వచ్చరా…? పిల్లలు ఎలా చదువుతున్నారో ఉపాధ్యాయులు చెబుతున్నారా లేదా అని అడిగారు.. పిల్లలను అభినందించి క్లాస్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించారు.. గణితం బోధిస్తున్న టీచర్ తో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మాట్లాడారు.. తరగతి గదిలో వారికి ఏ విధంగా బోధిస్తున్నారో విద్యార్థినితో లెక్కలపై అడిగి తెలుసుకున్నారు..
మోడల్ స్కూల్ లో తల్లిదండ్రులతో.. నారా లోకేష్ తో కలిసి ఫోటో దిగారు సీఎం చంద్రబాబు.. రిజిష్టర్ లో తల్లిదండ్రులకు ప్రశ్నలు అడిగి వాటిని నోట్ చేసుకొని సంతకం చేశారు.. మరో తరగతిలోకి వెళ్లి విద్యార్థులు, పిల్లలతో కలసి కూర్చొన్నారు.. తల్లిదండ్రులతో కలసి వచ్చిన పిల్లలు ఎవరు అంటూ చేతులెత్తమన్నారు.. తండ్రుల కన్నా తల్లులే ఎక్కువగా వచ్చిన విద్యార్ధులను అభినందించారు సీఎం.. విద్య ఎలా ఉంది…. బాగా చదువుకుంటున్నారా లేదా.. అంటూ కుశల ప్రశ్నలు వేశారు.. విద్యార్ధినీ, విద్యార్ధులతో కరచాలన చేసి, మరో క్లాస్ కు వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు.. క్లాస్ లో ఎంత మంది ఉన్నారు ఇందులో గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ ఎంతమంది అని విద్యార్దినులనే అడిగారు. క్లాసులో చెబుతున్న సిలబస్ ను ఇతర్రా వివరాలను, కంప్యూటర్ లో ఎలా పిల్లలకు చదువుతు చెబుతున్నారో వివరాలను తెలిపారు మంత్రి లోకేష్.. కంప్యూటర్ ద్వారా పాఠాలు బోధించే విధానాన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు సీఎం చంద్రబాబు..
