YS Jagan: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విచారకరం.. మీడియాలో సమాచారం మేరకు 10 మంది వరకు మరణించారని తెలుస్తోంది.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలి.. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మా పార్టీకి చెందిన నాయకులను ఆదేశించాను.. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించారు.. అలాగే, సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు.. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటి వరకూ 10 మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తోంది అని జగన్ అన్నారు.
Read Also: Delhi Air Pollution Deaths 2023: వామ్మో.. ఒక్క ఏడాదిలోనే వాయు కాలుష్యంతో ఏకంగా 17,188 మంది మృతి..
ఇక, ఈ 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థం అవుతోంది అని మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది అని విమర్శించారు. ఇకనైనా కళ్లుతెరిచి తప్పులను సరిదిద్దుకోవాలని తెలిపారు.
