Site icon NTV Telugu

CM Chandrababu: కాశీబుగ్గలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి..

Chandrababau

Chandrababau

CM Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించిన ఆయన.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తనను బాగా కలచివేసింది.. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. ఈ తొక్కిసలాటలో గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Read Also: PM Modi: దాతృత్వానికి భారత్ ముందుంటుంది.. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో మోడీ వ్యాఖ్య

అలాగే, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిలాట దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందచేయాలని అధికారులకు ఆదేశాం.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలగా అండగా ఉంటుందని హోం మంత్రి అనిత హామీ ఇచ్చింది.

Exit mobile version