Site icon NTV Telugu

గత నెల జరిగిన హత్యకేసును చేధించిన శ్రీకాకుళం పోలీసులు

గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. అయితే ఈ అప్పలనాయుడితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసారు శ్రీకాకుళం 2టౌన్ పోలీసులు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రస్తుతం మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర పేర్కొన్నారు.

Exit mobile version