NTV Telugu Site icon

Thopudurthi Prakash Reddy: ఎస్సై సుధాకర్‌పై తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాల్లోకి రావాలనే..!

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy

Thopudurthi Prakash Reddy: రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పర్యటన కాక రేపుతోంది.. జగన్‌ పర్యటనపై కూటమి నేతలు ఫైర్‌ అవుతున్నారు.. ఇక, రామగిరి ఎస్సై సుధాకర్‌ పేరును జగన్‌ ప్రస్తావించడం.. జగన్‌ వ్యాఖ్యలకు సుధాకర్‌ కౌంటర్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఎపిసోడ్‌లో హాట్‌ కామెంట్లు చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసం రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యాఖ్యలు సరికాదన్నారు.. జగన్ ను విమర్శించే స్థాయి ఎస్సై సుధాకర్ యాదవ్ కు లేదన్న ఆయన.. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకర్ యాదవ్ కారణం అని ఆరోపించారు.. ఎస్సై సుధాకర్ యాదవ్ ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారు.. ఎస్సై సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది…! అని ఫైర్‌ అయ్యారు.

Read Also: Priyansh Arya: కుర్రాడికి ఎందుకు అంత డబ్బు అన్నారు.. కట్ చేస్తే సెంచరీతో దుమ్ములేపాడు!

ఇక, ఎస్సై సుధాకర్ యాదవ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు.. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అయితే, ఎమ్మెల్యే పరిటాల సునీత ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం గ్రహించాలని సూచించారు.. పరిటాల కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేదన్న ఆయన.. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే.. వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా? అని ప్రశ్నించారు. ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయన్నారు.. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా? పోలీసులపై చంద్రబాబు దూషణలు వినిపించవా? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు? చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాప్తాడు మాజీ ఎమ్మెల్ఏ తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి..