NTV Telugu Site icon

MLA Kethireddy: వచ్చే ఎన్నికల్లో జగన్కి ప్రజలందరూ అండగా నిలవాలి

Mla Kethireddy

Mla Kethireddy

శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. 75 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యనించారు. సమాజంలో 80 శాతం ఉన్న అణగారిన వర్గాలకు మేలు చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

Read Also: World Cup 2023: ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్ ఓపెనర్ అరుదైన రికార్డ్

ఇక, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్, మున్సిపల్, స్థానిక సంస్థల పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేస్తున్న ఘనత జగన్ ప్రభుత్వానిదే.. గత నాలుగున్నరేళ్లలో ధర్మవరం నియోజకవర్గంలోనే 2500 కోట్ల రూపాయల లబ్ది పొందారని ఆయన తెలిపారు.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా నిలవాలి అని ఆయన కోరారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు.. టీడీపీ హాయంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు.