దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా ఘోరంగా దెబ్బతింటున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఘాతుకాలకు తెగబడుతున్నారు. కఠినమైన శిక్షలు ఉంటాయన్న విషయం తెలిసి కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో మరో ఘోరం వెలుగు చూసింది.
ఇది కూడా చదవండి: AP IFS Transfers: 11 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో భర్త రాఘవేంద్ర దారుణానికి తెగబడ్డాడు. మద్యానికి బానిసై ఇంట్లో ఉన్న 50 కేజీల బియ్యాన్ని రాఘవేంద్ర అమ్మేశాడు. ఆ డబ్బులతో మద్యం సేవించాడు. ఈ విషయంపై భర్తను భార్య నిలదీసింది. ఇంట్లో ఉన్న తిండి గింజలు అమ్మేసుకుంటావా? అని ప్రశ్నించింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపంతో రగిలిపోతున్న రాఘవేంద్ర.. భార్య నిద్రపోయాక గొడ్డలితో నరికేశాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ పోషణ కొరకు భార్య కూలీ పనులకు వెళ్లేది.. ఇప్పుడు ఆమె మృతితో కుటుంబం రోడ్డున పడింది.
ఇది కూడా చదవండి: NTR District: దారుణం.. ప్రేమ వ్యవహారం నచ్చక కూతుర్ని చంపిన తండ్రి
