Site icon NTV Telugu

Dharmavaram Silk Sarees: ‘ధర్మవరం’ పట్టు చీరకు జాతీయ గుర్తింపు..

Dharmavaram Silk Sarees

Dharmavaram Silk Sarees

Dharmavaram Silk Sarees: మన ధర్మవరం చేనేత పట్టు చీరకు జాతీయ గుర్తింపు లభించింది.. దీనికి సంబంధించిన “ఒక జిల్లా ఒక ఉత్పత్తి” (ODOP – One District One Product)- 2024 అవార్డును ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు అందుకున్నారు మంత్రి సవిత, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్‌ చేతన్.. కాగా, భారత దేశ సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ధర్మవరం చేనేత పట్టు చీర 2024 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఒక జిల్లా ఒక ఉత్పత్తి” కార్యక్రమం క్రింద ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది.. ఈ గౌరవం ధర్మవరం పట్టు చీరల ప్రత్యేకతను, నైపుణ్య సంపదను దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపుచేసే దిశగా కీలకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు..

Read Also: Kriti Sanon : బాయ్ ఫ్రెండ్ తో ప్రభాస్ హీరోయిన్.. లండన్ లో చెక్కర్లు

ఇక, ఈ రోజు (సోమవారం) ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా.. ఏపీ బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత.. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. ఈ అవార్డులు వాణిజ్య రంగానికే కాకుండా, స్థానిక పరిశ్రమలకు విశేష ప్రోత్సాహం కలిగిస్తున్నాయన్నారు. ఇది కేవలం హస్తకళల ప్రదర్శన మాత్రమే కాకుండా, భారతదేశ భవిష్యత్తుకు ఒక సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. ఈ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు లభించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మంత్రి సవిత..

Exit mobile version