CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓ మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చాడు.. ఆ కుటుంబంలో ఆనందం నింపారు.. ఇక, ఆ చిన్నారి ఆనందానికి అవదులు లేవనే చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం విదితమే కాగా.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ మరుసటి రోజే.. ఆ చిన్నారి కోరిక తీర్చారు సీఎం..
Read Also: Peddhi : ‘పెద్ది’ నుండి శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..!
ఇక, ఆనందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు చిన్నారులు. ఒక్క చిన్నారి కోరిక మేరకు ఆ కుటుంబంలోని నలుగురికి సూకిళ్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో.. ఆ వెంటనే నాలుగు సైకిళ్లను ఆ కుటుంబంలోని చిన్నారులకు అందజేశారు జిల్లా అధికారులు. జులై 10వ తేదీన కొత్త చెరువులో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో తల్లికి వందనం పథకం కింద ఆ కుటుంబంలోని నలుగురుతో ముచ్చటించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇల్లు లేదని.. అద్దె ఇంట్లో ఉన్నామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది ఆ చిన్నారుల తల్లి మాధవి.. అంతేకాదు.. చిన్నారి కూడా సైకిల్ కావాలని తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, వెంటనే సైకిళ్లు అందించాలని సీఎం ఆదేశించడం.. ఆ మరుసటి రోజే ఆ చిన్నారుల కోరిక తీరుస్తూ.. నలుగురికి విద్యార్థులు సైకిళ్లు అందించడంతో.. ఆనందంతో ఆ చిన్నారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు..
