Site icon NTV Telugu

Kakani Govardhan Reddy: చంద్రబాబు సూపర్ సిక్స్.. సూపర్ హిట్? మాటలు పచ్చి అబద్ధాలే!

Kakani

Kakani

Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికి వదిలేసిందని వైసీపీ నేత, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సెట్టింగులు వేయించుకుని మాటలు చెప్పటం తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో అసలు వ్యవసాయ శాఖ పని చేస్తుందా?.. ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవు.. అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. పంటలు దెబ్బతిన్న చోట్ల కనీసం సమీక్షలు కూడా నిర్వహించటం లేదు.. అన్నదాతల గురించి ఆలోచించని దుర్మార్గమైన ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నారు.. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకోవడానికి మాత్రమే కూటమి నేతలు ఉన్నారు.. యూరియా పక్కదారి పడుతుందని వాళ్ల పత్రికల్లోనే వార్తలు రాశారని కాకాణి గుర్తు చేశారు.

Read Also: YouTube Music: 10వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త ‘యూట్యూబ్ మ్యూజిక్’.. కొత్త ఫీచర్స్ ఇవే!

ఇక, బూస్టర్ డోస్ యూరియా రైతులకు అందకపోతే పంటలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని మాజీ మంత్రి కాకాణి అన్నారు. బ్లాక్ మార్కెట్ లో బస్తాకు 200 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకే లా ద్వారా రైతులను అండగా ఉన్నాం.. రైతులు యూరియా విషయంలో ఏమీ చేయలేక వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది.. యూరియా మొత్తం ముడుపులు తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి రైతులను ముంచారని ఆరోపించారు. ఇవాళ రైతులు యూరియా దొరక్క ఎండనక, వాననకా యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది.. ఎరువుల సమృద్ధిగా ఉన్నాయని ఒకసారి చెప్తారు.. మరోసారి కొరత ఉందని ఒప్పుకుంటారు.. మీరు అసలు ఎరువులు ఏ హోల్ సేలర్ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల్ని వ్యాపారులు దోచుకుంటుంటే మీరు తీసుకున్న చర్యలు ఏవి? అని గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.

Read Also: BCCI: బీసీసీఐలో ఉద్యోగాలు.. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే?

అయితే, చంద్రబాబుకు పక్కవాళ్ళ పథకాలు కాపీ కొట్టటం తప్ప కొత్త పథకాలు ఇవ్వటం తెలియదని కాకాణి గోవర్థన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో రైతుల కోసం ప్రణాళికాబద్ధంగా పని చేసిన జగన్.. లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.. రైతులకు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాపై తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రైతు వేషం వేసి ఒక సెట్టింగ్ క్రియేట్ చేసి మాట్లాడటం.. నాలుగు అబద్ధాలు చెప్పి రావటం తప్ప, ఇంకా ఏం చేయడం లేదన్నారు. తన లాభం తప్ప రైతులను చంద్రబాబు పట్టించుకోడు అని వైసీపీ నేత కాకాణి విమర్శించారు.

Exit mobile version