Wife Killed Husband: నెల్లూరు జిల్లా రాపూరులో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్త శీనయ్యను భార్య ధనమ్మ కరెంట్ వైరుతో గొంతు బిగించి చంపేసింది. ఇక, భార్య ధనమ్మతో పాటు ప్రియుడు కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనమ్మ స్వగ్రామం రాపూరు మండలం పంగిలి.. పెళ్లి కాక ముందు నుంచే ఆమె కల్యాణ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా ఆ సంబంధాన్ని కొనసాగింది. ఈ క్రమంలో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది ఆమె. దీంతో భర్త హత్యకు స్కెచ్ వేసింది. ప్రియుడి సహకారంతో శీనయ్య మెడకు కరెంట్ వైరు చుట్టేసి హత్య చేసేసింది. ఈ ఘటన బుధవారం నాడు జరిగింది. అయితే, శీనయ్య, ధనమ్మ దంపతులకు ఐదేళ్ల క్రితం పెళ్లైనట్లు తెలుస్తుంది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది.
Read Also: IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం!
అయితే, రాపూరు పోలీసులు జరిపిన విచారణలో, భార్య ధనమ్మ తన ప్రియుడు కల్యాణ్‌తో కలిసి భర్త శీనయ్యను హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇక, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడితో కలిసి ధనమ్మ, భర్త శీనయ్య కాళ్లు చేతులు కట్టేసి, మెడకు కరెంట్ వైర్ బిగించి హత్య చేసింది. అనంతరం మద్యం మత్తులో తల గోడకు తాకి చనిపోయాడని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, మృతుడి చెవిలో నుంచి రక్తం రావడం, గొంతు దగ్గర కమిలిపోయి ఉండటం గమనించిన శీనయ్య తల్లిదండ్రులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు ఘటన వెలుగులోకి వచ్చింది.
