NTV Telugu Site icon

Minister Narayana: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి..

Narayana

Narayana

Minister Narayana: నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. పనుల్లో అలసత్వం వహిస్తే సహించం.. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి.. ప్రతీ లే అవుట్ లో పార్కుకు స్థలం వదలాలి.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టాము.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి.. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో పార్కులను సిద్ధం చేస్తున్నాము.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైపులైన్ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కట్టిన నిర్మాణాన్ని కొట్టేశారు.. ఐదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారు.. ఖజానా ఖాళీ చేసి వెళ్లారు.. రూ. 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్లారు.. సీఎం చంద్రబాబు చొరవతో నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Read Also: Tamil Nadu: డీలిమిటేషన్‌పై స్టాలిన్ నేతృత్వంలో నేడు దక్షిణాది సీఎంల భేటీ

అలాగే, టౌన్‌ ప్లానింగ్‌ సంస్కరణలు అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నాన్‌ హైరైజ్‌ భవనాల్లో సెట్‌బ్యాక్‌ నిబంధనలను సరళతరం చేయాలని నిర్మాణ సంస్థలు కోరాయని అన్నారు. అమరావతిలో 214 చ.కి.మీ పరిధిలో 27 యూనిట్లు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కొన్ని మినహాయింపులు కావాలని బిల్డర్లు కోరారు.. బిల్డర్లు కోరిన మినహాయింపుల్లో కొన్ని సాధ్యం కాదన్నారు. పాత పట్టణాల్లో సర్క్యులర్‌ ప్యాటర్న్‌ కొనసాగుతోంది.. లైసెన్స్‌ సర్వేయర్ల ఫీజు తగ్గించాలని బిల్డర్లకు తెలిపారు. ప్రస్తుతం ఫీజుగా ఒక్క రూపాయి మాత్రమే నిర్ణయించామని మంత్రి నారాయణ చెప్పారు.