Kakani Govardhan Reddy: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎం చంద్రబాబు చరమగీతం పాడారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నిర్ణయం వల్ల జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. సోమశిలను సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టం ఏంటి..? అని క్వశ్చన్ చేశారు. మేము వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయించారు.. మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ మీ టీడీపీ నేతలు ఖండించకపోవడం దారుణం అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడు అని మాజీ మంత్రి కాకిణీ మండిపడ్డారు.
Read Also: Toxic : టాక్సిక్ టీజర్.. యష్‌తో ఇంటిమేట్ సీన్స్‌లో రెచ్చిపోయిన బ్యూటీ ఎవరో తెలుసా?
ఇక, రాయలసీమ నుంచి సోమశిల, కండలేరుకు నీటిని తరలించి జిల్లాలోని మెట్ట ప్రాంతానికి నీరు ఇవ్వాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు అని మాజీ మంత్రి గోవర్థన్ రెడ్డి తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తెలంగాణా ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు అంటూ మడిపడ్డారు. మా హయాంలో తెలంగాణ ప్రాజెక్టులను జగన్ అడ్డుకున్నారు.. సోమశిల సందర్శనకు వెళ్తున్న తమను అడ్డుకోవడం దారుణం.. చంద్రబాబు చీకటి ఒప్పందాలను బయట పెడతాం.. బ్రిటిష్ పాలకుల లాగానే చంద్రబాబును కూడా ప్రజలు తరిమి కొడతారు అంటూ కాకాణీ గోవర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
