NTV Telugu Site icon

MLA Somireddy: పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా..? సంచలన వ్యాఖ్యలు

Somireddy Chandramohan Redd

Somireddy Chandramohan Redd

విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు. ‘సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్లడబ్బుతో చేస్తావా ఏంటీ’ అని విమర్శించారు. ‘ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు.’ అని ప్రశ్నించారు.

Read Also: MG MAJESTOR: ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త ఎస్‌యూవీ.. లుక్ అదుర్స్

‘2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్ గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగిస్తివి. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు…అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉంది.’ అని ఎక్స్ లో తెలిపారు.

Read Also: Akanksha Sharma : ఆకాంక్ష.. అలా అందాలను చూపించి ఆ‘కాంక్ష’లను పెంచకమ్మా !

‘మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా.. ఈ రాజీనామాల పరంపరం ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదు.. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.