తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమము, రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉందని అన్నారు. మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యమని అడిగే దమ్ము జగన్ కి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగన్ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ నేతలు కట్టకట్టుకుని వస్తున్నారని దుయ్యబట్టారు.
YCP: రేపు సీఎం జగన్తో నెల్లూరు నేతల భేటీ..
2019లో జగన్ సభ పెట్టిన చోటే చంద్రబాబు ఇవాళ సభ పెట్టారు.. 2019లో వచ్చిన ఫలితాలే రాష్టంలో రాబోతున్నాయని అనిల్ కుమార్ తెలిపారు. తమ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు చంద్రబాబు దృష్టిలో పతివ్రతలు అని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు దొంగలు అన్నట్లు చంద్రబాబు మాట్లాడారని దుయ్యబట్టారు. కాగా.. తమ అధినేత జగన్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని అనిల్ కుమార్ తెలిపారు.
IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు..
జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యేను చేశారు.. తనకు జగన్ వల్లే గుర్తింపు వచ్చిందని చెప్పారు. 2024లో పల్నాడు ప్రజల ఆశీస్సులు తనమీద ఉండాలని అన్నారు. జగనన్న గీత గీస్తే దాన్ని దాటనన్నారు. నిన్నటి దాక అసెంబ్లీలో తిట్టా.. రేపటి నుంచి ఢిల్లీలో తిడతానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాకి చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్ది, మేకపాటి రాజమోహన్ రెడ్డిలను నరసరావుపేట దీవించింది.. తనను కూడా దీవిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు.