Site icon NTV Telugu

Minister Narayana: భూ ఆక్రమణలు మానుకోవాలి.. ఆ భూములు స్వాధీనం చేసుకుంటాం..!

Narayana

Narayana

Minister Narayana: ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలి.. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ.. నెల్లూరు సిటీ అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లు, టీడీపీ నేతలు, కో-ఆర్డినేటర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి.. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. త్వరలోనే సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం అన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడా ఆగటం లేదని స్పష్టం చేశారు.. ఇక, రాష్ట్రంలో 68 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.. 32 వేల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతోంది.. నిబంధనల ప్రకారం అనర్హుల కార్డులు మాత్రమే తొలగిస్తున్నామని వెల్లడించారు.. కానీ, అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని.. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలని పట్టించుకోవద్దని సూచించారు మంత్రి పొంగూరు నారాయణ..

Read Also: Yusuf Pathan: దౌత్య బృందంలో యూసఫ్‌ పఠాన్‌.. టీఎంసీ అభ్యంతరం

Exit mobile version