NTV Telugu Site icon

Minister Narayana: నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం..

Narayana

Narayana

Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పిల్లర్లకు అంటించిన పోస్టర్లను మంత్రి నారాయణ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా అందంగా మారుస్తామన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం 90 శాతం విజయవంతమైంది అని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.. నెల్లూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మారుస్తాం.. ఫ్లెక్సీలను కూడా అనుమతించం.. రాజకీయ పార్టీల సమావేశాలు ఉన్నపుడు 48 గంటలు మాత్రమే అనుమతిస్తాం.. 2014-19ల మధ్య అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచనల మేరకు నగరంలో పోస్టర్స్, ఫ్లెక్సీలను తొలగించామని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.

Read Also: Vijayawada Durga Prasadam: దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి వెనక్కి పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

అలాగే, వారంలోగా నెల్లూరు నగరంలో ఉన్న పోస్టర్లను తొలగించాలని అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి.. వాటిల్లో ప్రకటనలు ఇచ్చుకోవాలని సూచిస్తున్నాం.. నా ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాం.. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల నేతలతో పాటు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. వీటితో పాటు ఆపరేషన్ బుడమేరు తరహలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో.. కాల్వల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామన్నారు. నెల్లూరులోని ప్రధాన కాల్వల స్థితిగతులపై.. సర్వే చేపట్టాం.. కాలువలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను తొలగించేందుకు రెడీగా ఉండాలి.. భవిష్యత్ ప్రయోజనాలు, గత చేదు అనుభవాల దృష్ట్యా వ్యూహాత్మక చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ సూచించారు.