Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కారును వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టడంతో.. ఆ కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, ప్రస్తుత సమాచారం ప్రకారం, అతి వేగంగా టిప్పర్ వచ్చి ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన తర్వాత కారుని టిప్పర్ కొద్ది దూరం లాక్కెళ్లినట్టు తెలుస్తుంది.
Read Also: CPI Narayana: నక్సలైట్లను చంపితే ఫ్యాక్షనిస్టులకు, ప్రభుత్వానికి తేడా ఏముంది..?
అయితే, ఈ ప్రమాదంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
