Site icon NTV Telugu

Heavy Rains in AP: ఏపీకి హైఅలర్ట్.. ఈ జిల్లా్ల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవు!

Rains

Rains

Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు వదిలి పెట్టడం లేదు. వర్షాకాలం ముగిసినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వానలు కురుస్తూనే పడుతున్నాయి. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు తుఫానులు ఏర్పడుతున్నాయి. ఇటీవల మొంథా, తాజాగా దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దిత్వా తుఫాన్ బలహీనపడినా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.

Read Also: Sky Walk In Vizag: పర్యాటకులకు గుడ్న్యూస్.. కైలాసగిరిపై స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం..

ప్రస్తుతం దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఇవాళ (డిసెంబర్ 1)కు మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసే అవకాశాలు ఉన్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొనింది. ఇక, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

Read Also: ఒక్కసారి ఛార్జ్.. 2 రోజులు బ్యాటరీ బ్యాకప్‌, 50MP కెమెరాలతో బడ్జెట్ సెగ్మెంట్ లో రాబోతున్న Oppo A6x 5G..!

అయితే, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ఇలా వరి కోతల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా ఈ వర్షాలు, చలి తీవ్రత నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. దిత్వా తుఫాన్ ప్రభావంతో సముద్రం అలజడి చెలరేగడంతో.. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించారు. ఇక, వర్షాలు అధికంగా కురుస్తున్న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Exit mobile version