Site icon NTV Telugu

Pinnelli Ramakrishna Reddy: జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి.. స్వాగతం పలికిన వైసీపీ నేతలు..

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ ఉత్తర్వుల కాపీని ఈరోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు. జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి.. అనిల్ కుమార్ యాదవ్ లు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం జైలు వద్దకు పిన్నెల్లి అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిని పోలీసులు జైలు ప్రాంగణం నుంచి బయటకు పంపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

Read Also: Blast in Firework Factory: ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

ఇక, పిన్నెల్లి విడుదల అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇలాంటి కేసులకు వైసీపీ నేతలు కార్యకర్తలు భయపడరని.. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. దేశంలో చాలా చోట్ల ఈవీఎంలను పగలగొట్టినా కేవలం పిన్నిల్లి పైనే కేసు నమోదు చేశారన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారు.. ప్రజలకు సంబంధించిన వ్యక్తిపై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారన్నారు.. చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు.. కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే మేం భయపడేది లేదన్నారు. చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు కాకాని గోవర్ధన్‌రెడ్డి..

Exit mobile version