Anil Kumar Yadav Mining Case: నెల్లూరు జిల్లాలో వైసీపీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై మైనింగ్ కేసు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్న బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శ్రీకాంత్ రెడ్డిని 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌కు పంపిన పోలీసులు, విచారణలో పలు సంచలన విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తుంది. అక్రమంగా క్వార్జ్ రవాణా జరిగిన ఘటనలో మాజీ మంత్రి అనిల్ ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్లు టాక్. ఈ మేరకు రికార్డ్ చేసిన కొన్ని కీలక వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: HHVM : మైత్రీ vs ఏషియన్ సినిమాస్..మధ్య పర్సంటేజ్ వార్..
అయితే, మైనింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో వెంచర్లు, హౌసింగ్ ప్రాజెక్టులు నిర్వహించామని బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డి సహా మరో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. మైనింగ్ కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తుందా? అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.
