వైపీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయలో విచారణకు హాజరయ్యారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నల్లపురెడ్డి ప్రసన్న దూషించిన కేసులో అనిల్‌కు నోటీసులు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అదే వేదికపైనే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. గత నెల 26న పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Palnadu: పల్నాడులో దారుణం.. భార్యను చంపి రైల్వేట్రాక్ దగ్గర పడేసిన భర్త
ఇక అనిల్ కుమార్ విచారణకు హాజరవుతున్నారన్న వార్తతో డీఎస్పీ కార్యాలయం దగ్గరకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో రూరల్డ డీఎస్పీ కార్యాలయం దగ్గర భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని దూషించిన కేసులో ఏ2 గా అనిల్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రికి తప్పిన విమానం ప్రమాదం.. పైలట్ ఏం చేశాడంటే..!
