NTV Telugu Site icon

Srisailam Temple: శ్రీశైలంలో రేపటి నుండి శ్రావణ మాసోత్సవాలు

Srisailam

Srisailam

శ్రీశైల దేవస్థానంలో శుక్రవారం నుంచి శ్రావణ మాసోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. రేపటి నుంచి ఆగస్టు 28వ తేదీ వరకు శ్రీశైలం క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు.. శ్రావణ మాసోత్సవాల సందర్భంగా దేవస్థానంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.. ఇక, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని.. శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమి రోజులలో స్వామివారి గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలిపివేయనున్నట్టు ప్రకటించారు ఈవో లవన్న… సామూహిక అభిషేక భక్తులకు శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమిలలో స్వామివారి అలంకరణ దర్శనం ఉంటుందని తెలిపారు.. శ్రావణమాస రద్దీ రోజులలో అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన నిలుపుదల చేయనున్నట్టు వెల్లడించారు.. అఖండ శివనామాలతో నెల రోజులు శివ సప్తాహ భజనలు నిర్వహిస్తామని.. రెండు, నాలుగవ శుక్రవారాలలో ముత్తైదువులకు ఉచితంగా సామూహిక వరలక్ష్మీవ్రతాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు ఈవో లవన్న.

Read Also: Hyderabad Rains : భాగ్యనగరంలో భారీ వర్షం.. ట్రాఫిక్‌ జాం