NTV Telugu Site icon

Pawan Kalyan Varahi Yatra: అన్నవరంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక పూజలు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan Varahi Yatra: నేటి నుంచి వారాహి విజయయాత్ర చేపట్టనున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నవరం సత్యదేవుని ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహంచారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్‌ వెళ్తారు. కత్తిపూడిలో నిర్వహించనున్న తొలి బహిరంగ సభలో పవన్‌ పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహియాత్ర ఈ సాయంత్రం ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. పది రోజుల పాటు 9 నియోజకవర్గాల్లో పర్యాటించి ఏడు సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. వారాహి అన్నవరంలో సందడి చేస్తుంది. జనసైనికులు వారాహిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

Also Read: EAPCET Results: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే..

వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి వాహనంపై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్‌ ప్రసంగిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. వారాహి యాత్ర నేపథ్యంలో ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి మొదలైంది. జనసేన శ్రేణులు ఎంతో ఉత్సహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ కటౌట్స్, జెండాలతో కత్తిపూడి ప్రాంతం మొత్తం కన్నుల పండగలా ఉంది. కత్తిపూడి మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతోంది. కత్తిపూడి నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుంది.