Site icon NTV Telugu

కరోనా ఎఫెక్ట్‌: ఈ నెలాఖరు వరకు 55 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా కరోనా కేసుల సంఖ్య 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో అన్ని రంగాలపై కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు 55 రైళ్లను రద్దు చేసింది. ప్రస్తుతం రద్దు అయిన రైళ్లలో ఎక్కువగా ప్యాసింజర్ రైళ్ల ఉన్నాయి. వీటితో పాటు కొన్ని మెయిల్ ఎక్స్ ప్రెస్ లైన్లు ఉన్నాయి.

Read Also: సీఎం కేసీఆర్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: బండి సంజయ్‌

అయితే ఇటీవల 21 నుంచి 24 వరకు 55 రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ రద్దు నిర్ణయాన్ని ఈ నెలఖరు వరకు పొడగించింది.ఇటీవల కాలంలో దక్షిణ మధ్య రైల్వేలో ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వే కలవరపడుతోంది. దీంతోనే రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. కోవిడ్ పరిస్థితిని బట్టి ఉద్యోగులకు ఎంతమందికి కరోనా సోకిందనేదాని బట్టి తదుపరి నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించే అవకాశం ఉంది. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది రైల్వే శాఖ

Exit mobile version