Site icon NTV Telugu

South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్దు.. ప్రటించిన దక్షిణ మధ్య రైల్వే

Train Cancel

Train Cancel

South Central Railway: తెలుగు రాష్ట్రాల్లో మే 21న 17 రైళ్లు రద్ద చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తున్నమని, ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఘట్‌కేసర్-చర్లపల్లి మధ్య చర్లపల్లి కోచింగ్ టెర్మినల్ నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 21న 17 రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట, కాచిగూడ-మిర్యాలగూడ, నడికుడి-మిర్యాలగూడ, గుంటూరు-వికారాబాద్. సికింద్రాబాద్-రేపల్లె, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-గుంటూరు, సికింద్రాబాద్-సిర్పూజ్ కాగజ్ నగర్ రైళ్లు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రీషెడ్యూల్ చేశారు. హౌరా-సికింద్రాబాద్, త్రివేండ్రం-సికింద్రాబాద్, సికింద్రాబాద్-మన్మాడ్ రైళ్లు, మరో ఐదు రైళ్లు మే 20, 21 తేదీల్లో ఆలస్యంగా నడుస్తాయి. హౌరా-సికింద్రాబాద్ రైలు (12703) 20వ తేదీ ఉదయం 8.35 గంటలకు బయల్దేరాల్సి ఉండగా దానిని 11.35 గంటలకు మార్చారు. సికింద్రాబాద్-మన్మాడ్ రైలు (17064) రాత్రి 18.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది కానీ రాత్రి 9.50 గంటలకు బయలుదేరనుంది. అలాగే, మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరాల్సిన భూషణేశ్వర్-ముంబై CSM(11020) 6.20కి, త్రివేండ్రం-సికింద్రాబాద్ ఉదయం 6.45కి బయలుదేరి 8.45కి, విశాఖపట్నం-ముంబై ఎల్‌టీటీ మధ్యాహ్నం 11.20 గంటలకు, మధ్యాహ్నం 1.2.00 గంటలకు బయలుదేరుతుంది.

మరోవైపు వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌, దిబ్రూగఢ్‌లకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బీహార్‌లోని దానాపూర్‌, అస్సాంలోని దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నంబర్ 07419 సికింద్రాబాద్-దానాపూర్ మధ్య మే 20 మరియు 27 తేదీల్లో. రైలు ప్రతి శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 11.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

దానాపూర్-సికింద్రాబాద్ రైలు నంబర్ 07420 మే 22- 29 తేదీల్లో బయలుదేరుతుంది. రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పుర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్‌పూర్, కట్నీ, సత్నా, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్, బక్సర్ రైల్వే స్టేషన్‌లలో రెండు దిశలలో ఆగుతాయి. సికింద్రాబాద్-దిబ్రూగఢ్ రైలు నంబర్ 07046 మే 22-29 తేదీల్లో.. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు బుధవారం రాత్రి 8.50 గంటలకు దిబ్రూఘర్ చేరుకుంటుంది. రైలు నెం. 07047 దిబ్రూఘర్-సికింద్రాబాద్ మధ్య మే 18, 25 మరియు జూన్ 1. ప్రతి గురువారం ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. రైలు శనివారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు వైపులా ప్రయాణాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో రైళ్లు ఆగుతాయి. సికింద్రాబాద్-దిబ్రూగఢ్ మధ్య ట్రాఫిక్ భువనేశ్వర్, కటక్, న్యూ జల్పైగురి, గుహ్వతి మీదుగా నడుస్తుందని అధికారులు తెలిపారు.
Honeymoon: హనీమూన్‌లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం

Exit mobile version