Site icon NTV Telugu

సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి సహా పలువురు నేతల అరెస్ట్‌ !

Somu Veerraju

Somu Veerraju

గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీలో ఆందోళన చేపట్టింది. కర్నూలు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు… కలెక్టర్ ఇంటిని ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సోమువీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డిసహా పలువురు నేతలను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ నేతలను బలవంతంగా స్టేషన్‌కి తరలించారు పోలీసులు. కాగా… ఇవాళ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించిన సోమువీర్రాజు… ఏపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. గణేష్ ఉత్సవాలు నిర్వహించడం పై ఏపీ సర్కార్ దారుణంగా వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. వెంటనే గణేష్ ఉత్సవాలపై నిబంధనలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version