Site icon NTV Telugu

ఏపీలోని 36 పథకాలకు జగన్‌ పేరు పెట్టుకున్నారు : సోము వీర్రాజు

చంద్రబాబు, సీఎం జగన్‌ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్‌ అయ్యారు. గతంలో చంద్రబాబు స్టిక్కర్ బాబుగా మారాడు…ఇప్పుడు జగన్ డబుల్ స్టిక్కర్ స్టిక్కర్ ముఖ్యమంత్రి గా తయారయ్యారని ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్ పథకానికి జగన్ పేరు పెట్టుకోవడమేంటో అర్థం కావడం లేదని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 36 పథకాలకు జగన్ పేరు పెట్టారని ఆగ్రహించారు.

అంబేద్కర్ నడయాడిన ప్రాంతాన్ని పంచ తీర్ధాలు గా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని…భారత రాజ్యాంగం విశిష్టత ను వివరిస్తూ ప్రధాన మంత్రి మోడీ గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పైన ప్రజలు పూర్తి విశ్వాసం చూపారని… సామాన్యుడి కి ఓటు హక్కు కల్పించడం తోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులనే ప్రజలు ఓడించడం ఇందుకు నిదర్శనమన్నారు. కాశ్మీర్ విషయాన్ని అంబేద్కర్ రాజ్యాంగంలో నే పొందుతారని.. విడివిడిగా ఏ రాజ్యం వుండడానికి వీలు లేదని వెల్లడించారు.

Exit mobile version