NTV Telugu Site icon

Somu Veerraju: ఉత్తరాంధ్ర నీటిప్రాజెక్టులపై జగన్‌ కి లేఖ

బీజేపీ నేతలు పదునైన విమర్శలతో వైసీపీని ఇరుకునపెడుతున్నారు. జగన్ కేబినెట్ గురించి బీజేపీ నేతలు ఘాటుస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌కి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీల పాత వీడియోని ట్యాగ్ చేస్తూ సీఎంకు లేఖ రాశారు.

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ ప్రకటించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర విషయంలో ఉత్తరాంధ్ర రైతులు చుక్క నీటి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మాగాణి భూములు ఎడారిని తలపిస్తున్నాయి. పునరావాస ప్యాకేజీలు లేవు ప్రాజెక్టుల నిర్మాణాలు లేవు. వంశధార ప్రాజెక్టు 19 టీఎంసీల ప్రాజెక్ట్.. అయితే ప్రస్తుతం 9 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉంది. ప్రభుత్వం 45 కోట్లు వ్యయం చేస్తే మొత్తం 19 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయి. వంశధార నాగావళి నదులు అనుసంధానం ఎందుకు చేయడం లేదు..? ఉత్తరాంధ్రను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వీటికి సమాధానం చెప్పండి..? అంటూ సోము వీర్రాజు ప్రశ్నించారు.

Show comments