Site icon NTV Telugu

Somu veerraju: ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు హిందూ దేవాలయాల నిధులా?

జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. జిల్లా కార్యాలయాల నిర్వహణకు దేవాలయాల నిధులిస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. కొత్త జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటుకు హిందూ దేవాలయాలు నుంచి నిధులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం దేవాలయాల నుంచి నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

అమ్మఒడి గత ఏడాది ఇవ్వలేదని.. ఈ ఏడాది జూన్ నెలలో ఇస్తామని చెప్పారని సోము వీర్రాజు గుర్తుచేశారు. జిల్లాల విభజన పూర్తి కాగానే అమ్మఒడికి కొత్త నిబంధనలు ప్రకటించారని ఆరోపించారు. అమ్మ ఒడి పథకానికి 300 యూనిట్లు విద్యుత్ ప్రామాణికం పెడితే ఎలా అని నిలదీశారు. ఆధార్‌లో కొత్త జిల్లా నమోదు వంటివి చాలా నిబంధనలు పెట్టారని.. ఈ కారణంగా 60శాతం మందికి అమ్మ ఒడి డబ్బులు రావని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి తొలి ఏడాది ఎలా ఇచ్చారో అలాగే ఈ ఏడాది కూడా ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న తుగ్లక్ చర్యలను తాము అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Dharmana: మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు.. కేవలం నిజాయితీవల్లే సాధ్యం..!

Exit mobile version