Site icon NTV Telugu

ఏపీ సర్కార్‌.. హిందూ వ్యతిరేక ప్రభుత్వం : సోము‌ వీర్రాజు

Somu Veerraju

Somu Veerraju

గుంటూరు : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము‌ వీర్రాజు పేర్కొన్నారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుడిని ఇవాళ దర్శించుకున్నారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్వేది రధం ధగ్ధం కేసులో ఇంత వరకు పురోగతిలేదని.. రామతీర్ధం ఘటనలో ఇంత వరకు ఏవిధమైన చర్యలూ లేవని తెలిపారు. అదే అంతర్వేదిలో చర్చిపై రాయిపడితే వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపారని… జగన్ ప్రభుత్వ ప్రధాన అజెండా క్రిష్టియానిటీని డెవలప్ చేయడమే అని ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీసే దిశగా తీసుకెళ్తుందని… ఇప్పటికి ఇంకా 20% ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాష్ట్రంలో స్తోమతకు మించి అప్పులు చేయడం,ఆర్ధిక అభివృద్ధికి ప్రణాళికలు లేవని ఫైర్‌ అయ్యారు. ఉద్యోగులకు,కార్మికులకు ఇచ్చిన అనేక హామీలు తుంగలో తొక్కారని నిప్పులు చెరిగారు.

Exit mobile version