Site icon NTV Telugu

ఢిల్లీకి ఏపీ బీజేపీ చీఫ్‌.. మూడు రోజుల పర్యటన

Somu Veerraju

Somu Veerraju

ఢిల్లీకి పయనం అవుతుంది బీజేపీ ఏపీ టీమ్‌… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో.. హస్తినకు వెళ్లనున్నారు పార్టీ నేతలు.. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న నేతలు.. పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు.. పార్టీ పెద్దలతో కూడా సమావేశం కానున్నారు.. ఈ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు సోము వీర్రాజు.. ఇక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షేకావత్’ తో భేటీ కానున్న ఏపీ బీజేపీ టీమ్.. పోలవరం ప్రాజెక్టు, ఆర్‌ అండ్ ఆర్‌ ప్యాకేజీ, ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు రైల్వే శాఖామంత్రి అశ్వని వైష్ణవితో భేటీ కానున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు.. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై మంతనాలు జరపనున్నారు. ఈ పర్యటనలో మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుండగా.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమై.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ మధ్యే పోలవరం పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన బీజేపీ నేతలు.. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.. నిర్వాసితులను అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.. ఈ టూర్‌లో ఈ సమస్యలను కూడా కేంద్రం దగ్గర ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Exit mobile version