Site icon NTV Telugu

బద్వేలు ఉప ఎన్నికపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

బద్వేలు ఉప ఎన్నికలును పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్ పార్టీ కి భయపడాల్సిన పని లేదని… బద్వేలు సమీపంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. జగన్, చంద్రబాబు ఈ ప్రాంతంలో ఎక్కడైనా రోడ్లు వేశారా… ఆంధ్రప్రదేశ్ ను ఏడు ఏళ్లుగా నరేంద్ర మోదీ నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాడని తెలిపారు..రాష్ట్రంలో ఏడేళ్ల అభివృద్ధి పై చర్చించడానికి బీజేపీ సిద్ధమని… జగన్, చంద్రబాబుకు దీనిపై చర్చించడానికి సిద్ధమా…? అని సవాల్‌ విసిరారు. బద్వేలు అసెంబ్లీ అంతా గోతుల మయమని మండి పడ్డారు. మద్యపానం నిషేధం అని చెప్పి… రూ.20 సీసా రూ.200 లకు జగన్ అమ్ముతున్నాడని ఆరోపించారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాన్ని బీజేపీ ప్రోత్సహించదని…బద్వేలు ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

Exit mobile version