Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. ‘SMS పే సిస్టమ్’ సేవలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించిన బ్రేక్ దర్శనం టిక్కెట్లను పొందుతున్న భక్తుల సౌకర్యార్థం TTD ఇటీవల SMS చెల్లింపు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త విధానంలో, చెల్లింపు లింక్ SMS ద్వారా సెల్ ఫోన్ లకు పంపనున్నారు. భక్తులు ఆ లింక్‌పై క్లిక్ చేసి UPI లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు, MBC-34 కౌంటర్‌కు వెళ్లకుండా బ్రేక్ దర్శన్ టిక్కెట్‌ల ప్రింటవుట్ తీసుకోవచ్చు. ఇప్పటికే CROలో లక్కీడిప్ ఆఫ్‌లైన్ ద్వారా సంపాదించిన సేవాటికెట్లను పొందుతున్న భక్తుల కోసం ఈ విధానం అమలుకానుంది.
16న తిరుమలలో రథసప్తమి
తిరుమలలో రధ సప్తమి: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రధ సప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. వేదాల ప్రకారం, శ్రీ సూర్యదేవుడు ఈ పవిత్రమైన రోజున జన్మించాడు మరియు మొత్తం ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భారీగా తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
Also Read
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
Read also: Childrens Kidnap: రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు.. అంతా అవాస్తవమన్న పోలీసులు
వాహన సేవల వివరాలు:
* ఉదయం 5.30 నుండి 8 వరకు (సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) – సూర్య ప్రభ వాహనం
* ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
* ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
* మధ్యాహ్నం 1 నుండి 2 వరకు – హనుమాన్ వాహనం
* మధ్యాహ్నం 2 నుండి 3 వరకు – చక్ర స్నానం
* సాయంత్రం 4 నుండి 5 వరకు – కల్ప వృక్ష వాహనం
* సాయంత్రం 6 నుంచి 7 వరకు – సర్వభూపాల వాహనం
* రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. కాగా… సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు.
C-390 Aircraft: విదేశీ కంపెనీ సాయంతో త్వరలో విమానాలను తయారు చేయనున్న మహీంద్రా
తాజావార్తలు
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!