Site icon NTV Telugu

Skill Development Case: సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం..

Cm Chandrababu

Cm Chandrababu

Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుపై నమోదైన కేసు మూసివేశారు. మొత్తం 37 మందిపై విచారణను కోర్టు క్లోజ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణపై సీఐడీ తుది నివేదిక ఆమోదిస్తూ ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో నారా చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ లో నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు అయింది. ఈ కేసులో 53 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉన్నారు. రూ. 371 కోట్ల దుర్వినియోగం అయినట్టు సీఐడీ కేసు చేసింది. ఈ కేసులో ఏ37గా చంద్రబాబు ఉన్నారు.

ఇక, మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్స్ గా పేర్కొంటూ నిందితులపై కేసు విచారణను న్యాయస్థానం మూసివేసింది. తుది నివేదికపై వాదనలు వినాలంటూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసినట్లు తెలిపింది.

Exit mobile version