Site icon NTV Telugu

Rachamallu Siva Prasad Reddy: దమ్ముంటే నాతో కలిసి మీపై కూడా సీబీఐ విచారణను కోరండి

Rachamallu Siva Prasad Reddy

Rachamallu Siva Prasad Reddy

Rachamallu Siva Prasad Reddy: స్వచ్చందంగా నా అవినీతి పై, అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని కొరబోతున్నానని కడప జిల్లా ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అలాగే లోకేష్ నాయుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి తమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని అడుగుతారా? అంటూ ప్రశ్నించారు. పొదుపు సంఘాల మహిళలను మోసం చేసిన టీడీజీ మహిళా నేత వద్ద నుంచి డబ్బు ఇప్పించాలని టీడీపీ ఇంచార్జీ ప్రవీణ్ ఇంటి వద్దకు వెళితే మహిళలను వెంటపడి కొట్టారని ఎద్దేవ చేశారు. మహిళలపై దాడి చేసిన టీడీపీ ఇంచార్జీ ప్రవీణ్ కు టీడీపీ నేతలు అచెన్నయుడు, సోమిరెడ్డి సమర్ధించి నాపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

నా రాజకీయ జీవితంలో ఏనాడూ నేను దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడలేదు. చేతనైతే నిరూపించండి అని సవాల్‌ విసిరారు. నాకు నేనుగా స్వచ్చాందంగా నా అవినీతి పై, అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని కొరబోతున్న.. అలాగే లోకేష్ నాయుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి తమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని అడుగుతారా? అంటూ ప్రశ్నించారు. రాజకీయాలలో లేనప్పుడు వారి ఆస్తులెంత, రాజకీయాల్లోకి వచ్చాక వారి ఆస్తులు ఎంత..సీబీఐ విచారణ చేపట్టాలని కోరారు. నేను సీబీఐ అధికారులను కలవడానికి వెళ్ళే ముందు టీడీపీ నాయకులకు చెప్పే వెళతానని అన్నారు. దమ్ముంటే నాతో కలిసి మీపై కూడా సీబీఐ విచారణను కోరండి.
Byreddy Rajasekhar Reddy: జగన్ ప్రభుత్వంలో భూకుంభకోణాలు ఎక్కువయ్యాయి

Exit mobile version