Site icon NTV Telugu

MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు..

Mithunreddy

Mithunreddy

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈరోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులోని ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ సందర్భంగా నాలుగు బృందాలుగా విడిపోయిన సిట్ అధికారులు.. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. ఇక, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కార్యాలయ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. సోదాల సమయంలో పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసినట్లు తెలుస్తుంది.

Read Also: Kollywood : వరుస ప్లాప్స్.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న స్టార్ హీరో

అయితే, లిక్కర్ కుంభకోణం కేసులో ఏ4గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో తర్వాత ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా, విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ సోదాలు చేపట్టినట్లు సిట్ వర్గాలు వెల్లడించాయి. లిక్కర్ కేసుతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version