తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్‌ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు.
అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది ప్రత్యక్షంగా ఉద్యోగవకాశాలు రానున్నాయి. కంపెనీల ఏర్పాటుకు భూముల కేటాయింపు, పరిశ్రమలకు అందుబాటులో తగిన వనరులు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించనట్లు తెలుస్తోంది.