Site icon NTV Telugu

AP High Court : నేడు ఏడుగురు జడ్జీల ప్రమాణ స్వీకారం..

జడ్జీల కొరతతో ఇబ్బంది పడుతున్న ఏపీ హైకోర్టుకు ఇప్పుడు కేంద్రం మరో ఏడుగురు న్యాయమూర్తులను నియమిస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టుకు ఏడుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు ఉన్నారు.

Exit mobile version