ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఏడు గురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయనే వార్తలు రావడంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. సుమారు రూ.3.5 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. దీంతో ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా పంచాయతీ అధికారిణిగా ఉన్న పార్వతిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కర్నూలు జిల్లా బనగానపల్లెలో డీఎల్‌పీవోగా పనిచేసినప్పుడు పార్వతీ అక్రమాలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పార్వతీ అనంతపురం వదిలి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.