NTV Telugu Site icon

‘చంద్రబాబుని, అయ్యన్నను గుండెల మీద తన్నుతా’.. తారాస్థాయికి చేరిన నేతల సవాళ్లు..

టీడీపీ నేతలు సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఏపీ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరి ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. వీరి ఛాలెంజ్ లతో ఏపీ రణరంగంగా మారింది. వైపీసీ నేతలేమో పట్టాభితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్‌ చేస్తూంటే.. టీడీపీ నేతలేమో గుడిలాంటి మా కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ ఘాటుగా స్పందించారు.

నాతో తగువుకు అయ్యన్న సిద్ధం అంటున్నాడు.. డేట్, టైం నీ ఇష్టమే.. అనకాపల్లి నెహ్రూచౌక్ కి వచ్చినా.. నర్సీపట్నం అబీద్ సెంటర్ కు రమ్మన్నా నేను సిద్ధం… అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోసారి ముఖ్యమంత్రిపై నోరుజారితే చంద్రబాబును ఇంటికి వెళ్ళి తన్నుతాం.. ఈ మాట అంటే మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి కోపం వస్తోంది… చంద్రబాబు ఎందుకు నువ్వునేను తన్నుకుందాం అని పిలుస్తున్నాడు… చంద్రబాబు కాలు అంత కూడా వుండనని అంటున్నాడు.. నా కాలు సైజు దగ్గరనుంచి అయ్యన్న చూసినట్టు లేదు.. మరోసారి ముఖ్యమంత్రిని ఏమన్నా అంటే చంద్రబాబుని, అయ్యన్నను గుండెల మీద తన్నుతాను… అప్పుడు చూద్దురుగాని నా కాలు సైజు ఎంతో తెలుస్తుంది… అంటూ ధ్వజమెత్తారు.