Site icon NTV Telugu

ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు న‌మోదు

ఒమిక్రాన్ వేరియంట్ మ‌న దేశంలో క్ర‌మ క్ర‌మంగా విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టికే మ‌న దేశంలో 200 కు పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా.. ఏపీలో మ‌రో ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. కెన్యా నుంచి తిరుప‌తి వ‌చ్చిన మ‌హిళ‌కు ఒమిక్రాన్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

https://ntvtelugu.com/vellampalli-counter-to-ashok-gajapathiraju/

39 ఏళ్ల స‌ద‌రు మ‌హిళ ఈ నెల 12 వ తేదీన కెన్యా నుంచి చెన్నై వ‌చ్చారు. అక్క‌డి నుంచి తిరుప‌తి చేరుకున్న మ‌హిళ నమూనాల‌ను సేక‌రించి.. జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు అధికారులు. అయితే ఆమెకు ఒమిక్రాన్ సోకిన‌ట్లు తాజాగా నిర్ధార‌ణ అయింది. అయితే.. ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యుకు మాత్రం నెగిటివ్ వ‌చ్చింది. కాగా.. ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

Exit mobile version