NTV Telugu Site icon

Godavari: గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

Godavari

Godavari

Godavari: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తుంది. అల్లూరి జిల్లా, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. అల్లూరి జిల్లాలో 100కు పైగా లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంది. చింతూరు నుంచి ఛత్తీస్‌ గఢ్, ఒడిస్సా, తెలంగాణ రాష్ట్రాలకు ఐదు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాల్లోనే డ్రైవర్లు, ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

Read Also: Bangladesh Protest : మమతా బెనర్జీ పై షేక్ హసీనా ప్రభుత్వం భారత సర్కార్‎కు ఫిర్యాదు

ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బందంలో చిక్కుకుపోయాయి. ఈ వరదల వల్ల వరి, నారుమళ్ళు, ఉద్యాన, కూరగాయలు పంటలు మొత్తం నీటమునిగాయి. భద్రాచలం దగ్గర గోదావరి తగ్గుముఖం పట్టింది. 46.07 అడుగుల దగ్గర గోదావరి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం 10, 83, 684 క్యూసెక్కులకు చేరింది. అయితే, గోదావరి వరదపై అధికారులు సమీక్ష నిర్వహించారు. నేటి మధ్యాహ్నానికి వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోదావరి పరివాహ ప్రాంతంలో గడిచిన 12 నుంచి 18 గంటల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు. ధవలేశ్వరం బ్యారేజీ దగ్గర వరద నీరు ఎగువ నుంచి నిలకడగా వస్తుంది. ప్రస్తుతానికి 14.50లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు రిలీజ్ అవుతుంది.