NTV Telugu Site icon

ఆట స్థలంలో కోల్డ్ స్టోరేజ్… కలెక్టర్ కు చిన్నారుల విజ్ఙప్తి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మరియు కాలేజ్ పిల్లలకు ఆట స్థలం క్రింద ఉన్న ఒకే ఒక్క స్థలంలో ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దాంతో ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు పాఠశాలల విద్యార్థులు. మాకు ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలి… చుట్టుపక్కల రెండు మూడు ఊర్లలో ఒక్క గ్రౌండ్ కూడా లేదు. మాకు ఈ ఒక్క గ్రౌండ్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కట్టొద్దంటూ కలెక్టర్ కు చిన్నారులు విజ్ఙప్తి చేశారు. అయితే చూడాలి మరి ఈ చిన్నారుల సందేశం పై శ్రీకాకుళం కలెక్టర్ స్పందిస్తారా… లేదా అనేది.