Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ప్లాన్ చట్టం గడువు పెంపు

Jagan Government

Jagan Government

Andhra Pradesh: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంచింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు మరో 10 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు ఈనెల 23వ తేదీతో ముగియనుంది. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ సబ్ ప్లాన్ గడువు పెంచాలని ఎస్సీ, ఎస్టీలు విజ్ఞప్తి చేశారని వెల్లడించింది. గడువు పెంపునకు సంబంధించిన ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రచురిస్తారని తెలిపింది. సబ్ ప్లాన్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు నిధుల కేటాయింపు, నిధుల వినియోగం, అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు వీలవుతుంది.

Read Also: Gujarat Court: ఆవు పేడతో చేసిన ఇళ్లు అటామిక్ రేడియేషన్‌కు ప్రభావితం కావు..

కాగా 2013లో అమలులోకి వచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఎస్సీ, ఎస్టీలకు అనుకున్నంతగా ఉపయోగపడలేక పోయిందని ఇటీవల కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్రా మాల్యాద్రి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ తిరిగి కొనసాగించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ సరిగ్గా అమలు జరగలేదు కాబట్టి ప్లాన్‌ గడువు పొడిగించి.. మళ్లీ పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. పదేళ్లు పోరాటం చేసి ఈ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించుకున్నట్లు ఆయన గుర్తుచేశారు.

Exit mobile version