ఇస్లామిక్ సంస్థ అయిన తబ్లీగీ జమాత్ పై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. తబ్లీగీ జమాత్‌తో ప్రజలకు, సమాజానికి పెను ముప్పు పొంచి ఉందని ఈ విషయాన్ని మసీదులకు తెలియజేయాలని, ఆ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాగా, 1926లో ప్రారంభమైన ఈ సంస్థకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా 30-35 కోట్ల మంది ముస్లింలు తబ్లిగీని అనుసరిస్తున్నట్టు సమాచారం కాగా గతంలో కరోనా మొదటి వేవ్ అప్పుడు భారత్‌లో కూడా తబ్లీగి జమాత్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తబ్లీగీ జమాత్ సంస్థ సమావేశానికి హాజరైన వివిధ దేశాల నుంచి వచ్చిన వారితో కరోనా కేసులు పెరిగాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా తబ్లీగీ సమావేశానికి హాజరైన వారందరి వారి వల్లే దేశంలో కేసులు పెరిగాయని విమర్శలు వెల్లువెత్తాయి.
