NTV Telugu Site icon

Koneti Adimulam: హైకోర్టులో టీడీపీ బహిష్కృత నేత పిటిషన్.. లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని వినతి

Konetiadimulam

Konetiadimulam

తెలుగుదేశం బహిష్కృత నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసు కొట్టేయాలని కోరారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా, ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ ఘటన హనీట్రాప్‌గా ఆదిమూలం పేర్కొన్నారు. 72 సంవత్సరాల వయసులో గుండెకు స్టెంట్ వేయించుకున్నట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: UP News: 12 ఏళ్ల బాలికపై మదర్సా టీచర్ అత్యాచారం.. బందీగా ఉంచి అఘాయిత్యం..

తనపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం.. లైంగిక దాడికి పాల్పడినట్లు నియోజకవర్గం మహిళ.. తెలుగుదేశం హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది. ఆధారాలతో ఆమె కంప్లంట్ చేసింది. దీంతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంను తెలుగు దేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మాట్లాడాలంటూ హోటల్‌కు పిలిచి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. హైదరాబాద్‌కు వచ్చి మీడియా ముందు విషయాలు వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Ganesh Immersion: నరసరావుపేటలో విషాదం.. నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

Show comments