పులిచింతల ప్రాజెక్టులో జరుగుతున్న మరమ్మతు పనులను ప్రభుత్వ చీఫ్ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. ఏ లక్ష్యంతో అయితే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో ఆ లక్ష్యం నెరవేరేలా వైయస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ట్వీట్లు పెట్టే నాయకులు అధికారం లో ఉన్నప్పుడు పులిచింతల పనుల్లో నాణ్యత లో గుర్తించడంలో విఫలమయ్యారు అని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మా ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతం. 48 గంటల్లో 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్స్ నిర్మాణం చేసి రైతులకు భరోసా కల్పించాము. రాబోయే పది రోజుల్లో పులిచింతల రిజర్వాయర్ ను పూర్తిస్థాయిలో నింపేందుకు ప్రయత్నిస్తున్నాం… పై నుండి వరద నీరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రాజెక్టు గేట్లను ఆటోమేటిక్ హైద్రాలిక్ గేట్స్ గా మారుస్తాం అని చీఫ్ విప్ పేర్కొన్నారు.
వారు పులిచింతల పనుల్లో నాణ్యత గుర్తించడంలో విఫలమయ్యారు
