Site icon NTV Telugu

కడపలో సందడి చేసిన హీరోయిన్ సమంత

టాలీవుడ్‌ హీరోయిన్‌లలో సమంత గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకుల గొడవ.. మరోవైపు పుష్పలో ఐటం సాంగ్ వంటి విషయాలతో సమంత వార్తల్లో నిలుస్తోంది. దీంతో సమంత క్రేజ్‌ను పలు వ్యాపార సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా కడప పట్టణంలో ఆదివారం నాడు హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది.

Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్

సమంత తమ ఊరికి వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు.. సమంతను చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో కడప బస్టాండ్ సెంటర్ అభిమానులతో హోరెత్తిపోయింది. సమంతతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు పోటీలు పడ్డారు. అయితే బౌన్సర్లు, సమంత భద్రతా సిబ్బంది వారిని దూరంగా నెట్టివేశారు. సమంత రాక నేపథ్యంలో కడప బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో సాధారణ ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. కాగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం సమంత అభివాదం చేయగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కాగా కడపలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

Exit mobile version